The key character has become a bit of a guest character
కీలక పాత్ర కాస్త అతిథి పాత్రగా మారిందా..! మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. దాదాపు 30 నిమిషాలు పాటు చెర్రీ పాత్ర ఉండబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇందులో చెర్రీ కోసం ఓ హీరోయిన్‌ను పెట్టాలనుకుంటున్నట్లు కూడా టాక్ నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ పాత్ర నిడివికి కొరటాల కత్తెర వేశారట. రామ్ చరణ్‌కి డేట్ల విషయంలో క్లాష్ ఉండకూడదనే కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అంతకుముందు చెర్రీది కీలక పాత్ర అనుకున్నప్పటికీ.. ఇప్పుడు అతిథి పాత్రగా మారిందట. ఈ మార్పుకు చిరు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే తండ్రి, కొడుకులు కలిసి ఈ సినిమాలో తక్కువ సేపు మాత్రమే కలిసి నటించనున్నారు. కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు రెండు పాత్రల్లో నటించనున్నారు. అందులో ఒకటి నక్సలైట్ కాగా మరొకటి ప్రొఫెసర్...