EPFO Recruitment 2020
EPFO'లో ఉద్యోగాలు.. ఇవీ అర్హతలు
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO)లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
పోస్టుల వివరాలు..
అర్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు.
అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, సంస్థ ఉద్యోగులకు 5 సంవత్సరాల పాటు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం..
సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం..
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
రాతపరీక్ష విధానం..
➦ ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది.
➦ పరీక్ష సమయం 2 గంటలు.
➦ ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.
➦ ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
➦ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున మార్కులు కోత విధిస్తారు.
➦ 75 : 25 నిష్పత్తిలో రాతపరీక్షకు, ఇంటర్వ్యూకు వెయిటేజీ ఉంటుంది.
రాతపరీక్ష కింది విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
Comments
Post a Comment