Indian Oil Corporation Limited Marketing Division Has Given An Employment Notification For The Recruitment Of Technician And Trade Apprentice Vacancies

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 321 ఖాళీలు


ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ విభాగం టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2020 జనవరి 21 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.





టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటిస్: 312 పోస్టులు

అర్హత: టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు 50 శాతం మార్కులతో డిప్లొమా (ఇంజినీరింగ్), ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

డిప్లొమా విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్.

ఐటీఐ ట్రేడ్లు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్.


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.12.2020

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.01.2020

* అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 28.01.2020

* రాతపరీక్ష తేది: 02.02.2020





Comments

Popular posts from this blog

AP Outsourcing Jobs Registration Latest Update 19-12-2019

స్థలాల రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆన్‌లైన్లో

DRDO 2020 Scholarship Registration for Girls