5 Whatsapp Tips And Tricks That You Must Know
Whatsappలో ఎవరికీ తెలియని ఈ 5 ట్రిక్స్ మీకు తెలుసా? ప్రముఖ మెసేజింగ్ యాప్ Whatsappలో ఎవరికీ తెలియని ఈ టిప్స్ గురించి మీకు తెలుసా? 2020లో వీటి గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! 1. మిమ్మల్ని ఎవరైన కావాలని దూరం పెడుతున్నారనుకుంటున్నారా? నిజానికి మీరు పంపే మెసేజ్ లను, అవతలి వారు చదివారో లేదో తెలుసుకోడానికి వాట్సాప్ లో బ్లూ టిక్స్ బటన్ ఎలాగో అందుబాటులో ఉంది. అయితే ఎదుటివారు మీ మెసేజ్ లను చదవకుండా మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది. ✪ వాట్సాప్ యాప్ లో చాట్‌బాక్స్ ఓపెన్ చేయండి. ✪ మీరు ఎవరి చాట్ ను పరిశీలించాలనుకుంటున్నారో ఆ చాట్ ను ఓపెన్ చేయండి. ✪ అందులో వారు చదవని మీ మెసేజ్ ను ఎంచుకుని దాన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా సెలక్ట్ చేయండి. ✪ కుడివైపు పైభాగంలో మీకు కనిపించే మూడు చుక్కల ఐకాన్ పై క్లిక్ చేయండి. ✪ అంతే ఆ వ్యక్తికి మీ మెసేజ్ ఎప్పుడు రీచ్ అయిందో, దాన్ని వారు ఎప్పుడు చదివారో కూడా మీరు తెలుసుకోవచ్చు. ✪ అయితే ఈ ట్రిక్ ను మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉపయోగించవచ్చు. ✪ మీ మెసేజ్ ని గ్రూప్ లో ఎంతమంది చదివారో తెలుసుకోవచ్చు. ...