5 Whatsapp Tips And Tricks That You Must Know
Whatsappలో ఎవరికీ తెలియని ఈ 5 ట్రిక్స్ మీకు తెలుసా?
ప్రముఖ మెసేజింగ్ యాప్ Whatsappలో ఎవరికీ తెలియని ఈ టిప్స్ గురించి మీకు తెలుసా? 2020లో వీటి గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
1. మిమ్మల్ని ఎవరైన కావాలని దూరం పెడుతున్నారనుకుంటున్నారా?
నిజానికి మీరు పంపే మెసేజ్ లను, అవతలి వారు చదివారో లేదో తెలుసుకోడానికి వాట్సాప్ లో బ్లూ టిక్స్ బటన్ ఎలాగో అందుబాటులో ఉంది. అయితే ఎదుటివారు మీ మెసేజ్ లను చదవకుండా మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి కూడా ఒక మార్గం ఉంది.
✪ వాట్సాప్ యాప్ లో చాట్‌బాక్స్ ఓపెన్ చేయండి.
✪ మీరు ఎవరి చాట్ ను పరిశీలించాలనుకుంటున్నారో ఆ చాట్ ను ఓపెన్ చేయండి.
✪ అందులో వారు చదవని మీ మెసేజ్ ను ఎంచుకుని దాన్ని లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా సెలక్ట్ చేయండి.
✪ కుడివైపు పైభాగంలో మీకు కనిపించే మూడు చుక్కల ఐకాన్ పై క్లిక్ చేయండి.
✪ అంతే ఆ వ్యక్తికి మీ మెసేజ్ ఎప్పుడు రీచ్ అయిందో, దాన్ని వారు ఎప్పుడు చదివారో కూడా మీరు తెలుసుకోవచ్చు.
✪ అయితే ఈ ట్రిక్ ను మీరు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఉపయోగించవచ్చు.
✪ మీ మెసేజ్ ని గ్రూప్ లో ఎంతమంది చదివారో తెలుసుకోవచ్చు.
2. టైప్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్ లు పంపవచ్చు ఇలా!
గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీరు వాట్సాప్ లో ఇన్ స్టంట్ టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజ్ లను పంపవచ్చు. ఓకే గూగుల్ లేదా హే గూగుల్ అనడం ద్వారా మీరు మీ వాయిస్ అసిస్టెంట్ కు లేదా గూగుల్ అప్లికేషన్ ఉపయోగించైనా, ఈ వాయిస్ అసిస్టెంట్ యాక్సెస్ చేయవచ్చు. ఆ తర్వాత, మీరు మెసేజ్ ఎవరికి పంపాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ నేమ్ ను చెప్పడం ద్వారా ఈ మెసేజ్ ను పంపవచ్చు. అంతేకాకుండా ఆ మెసేజ్ చదవడానికి ఆ యాప్ ను ఓపెన్ చేయమని కూడా అడగవచ్చు.
3. ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడవచ్చు!
వాట్సాప్, ఫేస్‌బుక్ లేదా మరే ఇతర సోషల్ మీడియా అప్లికేషన్లకు సంబంధించినవి అయిన రెండు వేర్వేరు అకౌంట్లను ఉపయోగించాలని అనుకుంటున్నారా? అయితే పారలల్ స్పేస్, డ్యూయల్ స్పేస్, 2అకౌంట్స్ వంటి మొబైల్ అప్లికేషన్స్ ను మీరు ఉపయోగించవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ అప్లికేషన్స్ లేనట్లయితే, మీరు వీటిని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ లో ఏదైనా ఒకదాన్ని ఇన్‌స్టాల్ చేసి, దానికి అవసరమైన పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత, రెండో వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ లేదా టెలిగ్రామ్ అకౌంట్స్ ను మీరు ఇందులో ఉపయోగించవచ్చు. కొన్ని కంపెనీల మొబైల్ ఫోన్లు, తమ కస్టం యూజర్ ఇంటర్ఫేస్లో భాగంగా ఈ ఫీచర్ ని ముందుగానే పొందుపరుస్తున్నాయి. యాప్ క్లోనర్ వంటి ఫీచర్లు ఇందుకు ప్రధాన ఉదాహరణ.
Comments
Post a Comment