stop china products in india డ్రాగన్‌కు తొలి ఝలక్.. బీఎస్ఎన్ఎల్‌ నుంచే మొదలుపెట్టిన భారత్!

గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణల్లో 20 మంది జవాన్లు అమరులవడంతో భారత్ తీవ్రంగా పరిగణించింది. దొంగదెబ్బ తీసిన పొరుగుదేశంపై ప్రతీకారం తీర్చుకోవడానికి 





సరిహద్దుల్లో దొంగదెబ్బ తీసి 20 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న చైనాకు తగిన గుణపాఠం చెప్పాలని భారత్ భావిస్తోంది. కేవలం సైనిక చర్యల ద్వారా మాత్రమే కాకుండా.. వాణిజ్యపరంగానూ సమాధానం చెప్పాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వరంగ టెలికమ్ సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాలను వినియోగించరాదని నిర్ణయించారు. భద్రత కారణాల వల్ల చైనా పరికరాలను పక్కనబెట్టాలని టెలికం శాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి రీ-టెండరింగ్‌ కూడా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి.

అంతేకాదు, ప్రయివేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తిచేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించమనే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్ లాంటి టెలికం సంస్థలు చైనాకు చెందిన హువాయ్‌ నెట్‌వర్క్స్‌తోనూ, బీఎస్ఎన్ఎల్ జీటీఈతో కలిసి పనిచేస్తున్నాయి. చైనా సంస్థలు ఉత్పత్తిచేసే నెట్‌వర్క్ పరికరాల భద్రతపై ముందు నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు సైతం చైనా సంస్థలు తయారుచేసే టెలికమ్ పరికారాలపై 2012లో సందేహాలు వ్యక్తం చేశారు. సైబర్ ముప్పు పొంచి ఉందని, వీటి వినయోగంలో పునరాలోచించాలని సూచించారు. అయితే, వీటిని చైనా సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ను హువాయ్ హ్యక్ చేసిందని భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించి, దర్యాప్తునకు ఆదేశించింది.

ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా.. రాబోయే 5 జి నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియోకు ఒక్క చైనా నెట్‌వర్క్ భాగం కూడా ఉండదని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చారు. చైనా పరికరాలను ఉపయోగించని ప్రపంచంలోని ఏకైక నెట్‌వర్క్ రిలయన్స్ జియో అని ట్రంప్‌కి ఆయన చెప్పారు. జియో 4 జి, 5 జి నెట్‌వర్కింగ్ భాగస్వామిగా దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ కొనసాగుతోంది.


Comments

Popular posts from this blog

AP Outsourcing Jobs Registration Latest Update 19-12-2019

స్థలాల రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఆన్‌లైన్లో

current affairs feb 2020 awards